logo

Vijayawada: వెలంపల్లి.. ఇదేం లొల్లి..

ఈ చిత్రం చూడండి.. ఏకంగా విజయవాడ మధ్య నియోజకవర్గం అంతా వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ కార్యాలయంలా, రహదారి మధ్యలో తవ్వేసి రాడ్లు పాతేసి స్వాగత ద్వారం ఏర్పాటుచేశారు.

Updated : 19 Feb 2024 09:27 IST

ఈనాడు - అమరావతి: ఈ చిత్రం చూడండి.. ఏకంగా విజయవాడ మధ్య నియోజకవర్గం అంతా వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ కార్యాలయంలా, రహదారి మధ్యలో తవ్వేసి రాడ్లు పాతేసి స్వాగత ద్వారం ఏర్పాటుచేశారు. పోనీ అదేమైనా సీఎం వస్తున్నారనో.. స్వాగతం తెలిపేలా పెట్టారు.. ఒకరోజు ఉంచి తీసేస్తారు అనుకోవడానికే లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని, మధ్య నియోజకవర్గానికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ని సీఎం జగన్‌ మార్పుచేశారు.

దీంతో ఇటీవలే వైకాపా సెంట్రల్‌లో తన కార్యాలయం ప్రారంభోత్సవానికి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిచి ఒకవైపు రహదారిని మూసేసి నడిరోడ్డుపైనే సభ ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఏకంగా మధ్య నియోజకవర్గమే వెలంపల్లి అడ్డాగా ఇలా భారీ స్వాగతద్వారం నడిరోడ్డుపై పెట్టడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇలా ఎవరూ అడ్డగోలుగా ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు చేపట్టలేదు. వెలంపల్లిని నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించినప్పటి నుంచి ఇలా వివాదాస్పద చర్యలే చేపడుతున్నారు. ప్రశ్నించే అధికారులెవ్వరు? ఈ స్వాగత ద్వారాన్ని కదిలించే పోలీసులెవరు..? అజిత్‌సింగ్‌నగర్‌ బాబాగుడి కూడలిలో కనిపించిన చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని