logo

ప్రజాతీర్పు కోరితే.. పునీతం అయినట్లే

ప్రభుత్వం చెప్పినట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ప్రకటించగానే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తప్పు చేయనట్లు కాదని, నిజంగా తప్పు చేయకుంటే ఆయన చేత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా

Published : 12 Aug 2022 04:47 IST

రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలవ, నాయకులు
హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడు తదితరులు

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: ప్రభుత్వం చెప్పినట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ప్రకటించగానే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తప్పు చేయనట్లు కాదని, నిజంగా తప్పు చేయకుంటే ఆయన చేత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరితే అప్పుడు పునీతం అయినట్లేనని అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల తెదేపా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, బీకే పార్థసారథి పేర్కొన్నారు. గురువారం అనంతపురం తెదేపా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. అందరూ అసహ్యించుకుంటుంటే ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా ఉన్నారని విమర్శించారు. బటన్‌ నొక్కే ఆయనకు, బటన్‌ విప్పిన ఎంపీకి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫోరెన్సిక్‌ నివేదికను బయటపెట్టకుండానే సజ్జల స్క్రిప్టును అనంతపురం ఎస్పీ చదివారని విమర్శించారు. హిందూపురం ప్రజలు సిగ్గుతో తలదించుకుంటే ఎంపీ మాధవ్‌కు కొంత కూడా సిగ్గులేదని విమర్శించారు. సమావేశంలో నాయకులు శ్రీధర్‌చౌదరి, ఆదినారాయణ, దేవళ్ల మురళి, ఉమామహేశ్వరనాయుడు పాల్గొన్నారు.
టమోటా రైతులకు మద్దతు ధర కల్పించాలి
కక్కలపల్లి, న్యూస్‌టుడే: టమోటా రైతులకు మద్దతు ధర కల్పించాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అనంతపురం గ్రామీణ మండలం కక్కలపల్లి పంచాయతీ పరిధిలోని టమోటా మార్కెట్‌ను గురువారం ఆయన సందర్శించి రైతుల ఇబ్బందులను  అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర దక్కక రైతులు టమోటాను ఖాళీ ప్రదేశాల్లో పారబోస్తున్నా కలెక్టర్‌, మంత్రులు పట్టించుకున్నపాపాన పోలేదని విమర్శించారు. బాధితులకు ఎకరాకు రూ.25 వేలు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతు ద్రోహి అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు