logo

జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు

మండలంలోని కనుకూరు ఉన్నత పాఠశాల విద్యార్థినులు అమృత(పదో తరగతి), సుప్రియ(తొమ్మిదో తరగతి) జాతీయస్థాయి టెన్నికాయిట్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

Published : 27 Jan 2023 04:33 IST

పతకాలు, ప్రశంసాపత్రాలు అందుకుంటున్న అమృత, సుప్రియ

శెట్టూరు, న్యూస్‌టుడే: మండలంలోని కనుకూరు ఉన్నత పాఠశాల విద్యార్థినులు అమృత(పదో తరగతి), సుప్రియ(తొమ్మిదో తరగతి) జాతీయస్థాయి టెన్నికాయిట్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. గురువారం విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన సబ్‌-జూనియర్‌ జాతీయస్థాయి ఫైనల్స్‌లో తమిళనాడు జట్టుపై విజయం సాధించారు. బంగారుపతకాలు అందుకున్నారని హెచ్‌ఎం ఫిరోజ్‌ఖాన్‌ పేర్కొన్నారు. గ్రూప్‌ విభాగంలో వీరితోపాటు కర్ణాటక విద్యార్థులతో పోటీపడి రజిని(పదో తరగతి) కాంస్యం సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పీడీ అమరాంజనేయులు, గ్రామస్థులు అభినందనలతో ముంచెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు