logo

కమనీయం... మహానగర సంకీర్తన

సత్యసాయి భక్తిగీతాలు..డప్పు వాయిద్యాలు..సంప్రదాయ నృత్యాలతో సత్యసాయి మహానగర సంకీర్తన నిర్వహించారు.

Published : 30 Mar 2023 03:44 IST

సాయిపల్లకీ ఊరేగింపులో భక్తులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే : సత్యసాయి భక్తిగీతాలు..డప్పు వాయిద్యాలు..సంప్రదాయ నృత్యాలతో సత్యసాయి మహానగర సంకీర్తన నిర్వహించారు. సత్యసాయి మహాసమాధి దర్శనార్థం హైదరాబాద్‌ భక్తులు పర్తియాత్రతో పుట్టపర్తి వచ్చారు. బుధవారం రాత్రి పట్టణంలోని హనుమాన్‌ కూడలి నుంచి ప్రశాంతి నిలయం వరకు సాయిభక్త బృందం కనులపండువగా తొమ్మిది సాయి పల్లకీల ఊరేగింపు పురవీధుల్లో నిర్వహించారు. కూడలిలో మహానగర సంకీర్తనను సత్యసాయి ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జేరత్నాకర్‌, సతీమణి హిమవాహిని జెండా ఊపి ప్రారంభించారు. సాయికుల్వంత్‌ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సాయికుల్వంత్‌ మందిరంలో సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీతగాన కచేరి భక్తులను మంత్రముగ్దులను చేసింది. బుధవారం రాత్రి సత్యసాయి సన్నిధిలో ప్రముఖ సంగీతగాయకుడు సాయి పూర్వవిద్యార్థి ముత్తుకుమార్‌ బృందం అద్భతంగా వీణాసంగీతగాన కచేరి నిర్వహించారు. ముత్తుకుమార్‌ బృందాన్ని మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జేరత్నాకర్‌, సతీమణి హిమవాహిని సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని