టెలీ మెడిసిన్ వ్యవస్థ ప్రారంభించండి
కిడ్నీ వ్యాధులతో బాధపడే రోగులకు సలహాలు, సూచనలు, వైద్య సహాయం అందించడానికి వీలుగా స్విమ్స్ నెఫ్రాలజీ విభాగం టెలీ మెడిసిన్ వ్యవస్థను ప్రారంభించాలని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
స్విమ్స్ అధికారులకు తితిదే ఈవో ఆదేశాలు
రోగితో మాట్లాడుతున్న తితిదే ఈవో ధర్మారెడ్డి తదితరులు
తిరుపతి(స్విమ్స్), న్యూస్‌టుడే: కిడ్నీ వ్యాధులతో బాధపడే రోగులకు సలహాలు, సూచనలు, వైద్య సహాయం అందించడానికి వీలుగా స్విమ్స్ నెఫ్రాలజీ విభాగం టెలీ మెడిసిన్ వ్యవస్థను ప్రారంభించాలని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. జేఈవో సదా భార్గవి, స్విమ్స్ సంచాలకురాలు డాక్టర్ వెంగమ్మతో కలసి స్విమ్స్ నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను శుక్రవారం పరిశీలించారు. రోగుల, డయాలసిస్ వార్డులు, ఐసీయూ విభాగాలను పరిశీలించి ఆస్పత్రిలో అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న పిల్లలకు పెన్షన్ రావడం లేదని బాధితుల కుటుంబాలు ఈవో దృష్టికి తీసుకొచ్చారు. పెన్షన్ మంజూరుకు హామీ ఇచ్చారు. డయాలసిస్ నిమిత్తం ఉపయోగించే బ్యాగులకు డిమాండ్ ఉందని వైద్యులు చెప్పడంతో.. ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి స్విమ్స్‌కు బ్యాగులు పంపాలని కోరారు. అనంతరం ఆయా విభాగాధిపతులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని ఐటీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఏ సీఏవో బాలాజీ, ఎంఎస్ డాక్టర్ రామ్, యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ అనిల్, డాక్టర్లు శివకుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్‌ను కోరిన అజిత్ మద్దతుదారులు
-
Weather Report: తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు