logo

ఈ లెక్కలు బయటకు రావా..?

కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.

Published : 29 Mar 2024 02:16 IST

పత్తా లేని కుల గణన
ఫిబ్రవరిలోనే సర్వే పూర్తి

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు హౌస్‌హోల్డ్స్‌ వద్దకు వెళ్లి 20 రకాల ప్రశ్నలకు సంబంధించిన వివరాలు సేకరించారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి 19న సర్వే ప్రారంభించారు. మొదట్లో జనవరి 28 నాటికి సర్వే పూర్తిచేయాలన్నారు. ఆ తర్వాత మరో వారం గడువు పొడగించారు. దీంతో జిల్లాలో సర్వే పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించకపోవడంతో కులాల లెక్క బయటకు పొక్కలేదు. జిల్లాలో 612 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,417 క్లస్టర్లు ఉన్నాయి. వాటి పరిధిలోని 5,89,386 హౌస్‌ హోల్డ్‌లలో 18,73,738 మంది సభ్యులు ఉన్నారు.


ఒకవేళ ప్రకటించి ఉంటే..?

కుల గణన సర్వే వివరాల్ని వెల్లడించి ఉంటే.. ఏ కులం ప్రజలు ఎంత మంది ఉండేవారనే ? విషయాలు బహిర్గతమయ్యేవి. ఒకవేళ వెల్లడించి ఉంటే ఆ వర్గాల నుంచి పార్టీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదనే  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంగతి అటుంచితే పాలకులు అనుకుంటే ఏమైనా చేయగలరు, దేన్నైనా ఆపగలరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని