logo

కుప్పంలో మారని అధికారుల తీరు.!

ఎన్నికల నియమావళి అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం అడుగడుగునా నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతుంది.

Published : 16 Apr 2024 01:42 IST

కోడ్‌ అమలులో అడుగడుగునా నిర్లక్ష్యం

పెద్దవంక శ్రీ కనకనాచమ్మ ఆలయం వద్ద ట్యాంకుపై జగన్‌ చిత్రం

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళి అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం అడుగడుగునా నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతుంది. నాయనూరు పంచాయతీ పెద్దవంక శ్రీ కనకనాచమ్మ ఆలయం వద్ద శుద్ధజల ట్యాంకుపై ఉన్న జగన్‌ చిత్రమే నిదర్శనం. ఆ పక్కనే వాహనాల పార్కింగ్‌ వద్ద నేటికీ వైకాపా స్తూపంలో ప్యాను తిరుగూనే ఉంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన 24 గంటల్లో నాయకుల చిత్రాలు.. జెండాలు తొలగించాల్సి ఉన్నా.. కుప్పంలో అధికారులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది.

వైకాపా జెండా స్తూపానికి తిరుగుతున్న ఫ్యాను

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని