logo

నామినేషన్ల పర్వానికి వేళాయే

సార్వత్రిక ఎన్నికల సమరానికి అడుగులు పడ్డాయి. నోటిఫికేషన్‌ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని ఒక లోక్‌సభ స్థానం, ఏడు శాసనసభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 18 Apr 2024 02:19 IST

నేటి నుంచి స్వీకరణ

కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌

తిరుపతి(కలెక్టరేట్‌): సార్వత్రిక ఎన్నికల సమరానికి అడుగులు పడ్డాయి. నోటిఫికేషన్‌ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని ఒక లోక్‌సభ స్థానం, ఏడు శాసనసభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సంబంధిత ఆర్వో కార్యాలయాల్లో వాటిని స్వీకరిస్తారన్నారు.

  • కలెక్టరేట్‌లో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. నామినేషన్లకు సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే కేంద్రాన్ని సంప్రదించాలని సంబంధిత అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈసారి ఆన్‌లైన్‌లోనూ

  • సువిధ యాప్‌ ద్వారా ఈసారి ఆన్‌లైన్‌లోనూ నామపత్రాలు దాఖలు చేయవచ్చు. ఆయా ప్రతులను ఆర్‌వో కార్యాలయంలో అందజేయాలి.
  • గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు పార్టీలు జారీచేసే ఏ, బీ ఫారాలను ఉప సంహరణ గడువులోగా అందజేయాలి. 
  • విద్యార్హతలు, నేరచరిత్ర, ఆస్తులు, అప్పులకు సంబంధించి అఫిడవిట్లు నామపత్రంతో పాటు జతచేయాలి. నేర చరిత్ర కలిగి, కోర్టు కేసులు ఎదుర్కొనే వారు ఆయా వివరాలు, కేసుల సంఖ్య ప్రస్తావిస్తూ పత్రికల్లో మూడుసార్లు ప్రకటనలు ఇవ్వాలి.
  • ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షలు ఖర్చు చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని