logo

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ తన విడిది కార్యాలయం నుంచి ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి మంత్రి కన్నబాబు, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు, కలె

Updated : 26 Jan 2022 04:53 IST

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న మంత్రి కన్నబాబు, ప్రజాప్రతినిధులు

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ తన విడిది కార్యాలయం నుంచి ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి మంత్రి కన్నబాబు, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు, కలెక్టర్‌ సి.హరికిరణ్‌, జేసీ భార్గవ్‌తేజ, మేయర్‌ శివప్రసన్న, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అల్లి రాజబాబు, అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ, అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ప్రభుత్వం ధైర్యాన్నిచ్చిందన్నారు. కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ, ఈబీసీ నేస్తం పథకంలో జిల్లాలో 45-60 ఏళ్లలోపు 29,406 మంది మహిళలకు తొలి విడతగా రూ.44.10 కోట్ల ఆర్థిక సాయాన్ని ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు పేర్కొన్నారు. అనపర్తికి చెందిన కొవ్వూరి లక్ష్మి, కాకినాడకు చెందిన కోడూరి సూర్యకుమారి వర్చువల్‌లో సీఎంతో మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌వీఎస్‌ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు