logo

బొమ్మల కొలువు... సృజనకు నెలవు

మట్టితో తయారు చేసిన దేవాలయం, వివిధ రకాల పక్షులు, జంతువుల బొమ్మలు, ఆసుపత్రిలో అందించే సేవలతో తయారైన నమూనా, ఏలేరు కాలువ పనులు చేస్తున్న పొక్లెయిన్‌, మట్టితో తయారైన పుట్ట, పూసలతో తయారు చేసిన బొమ్మలు, పిల్లల పార్కు.. చిరు ప్రతిమలతో రూపొందించిన సంప్రదాయ బొమ్మల కొలువు ఆకట్టుకుంది.

Published : 03 Oct 2022 05:47 IST

బొమ్మలు తీర్చిదిద్దుతున్న నాగేశ్వరి

ట్టితో తయారు చేసిన దేవాలయం, వివిధ రకాల పక్షులు, జంతువుల బొమ్మలు, ఆసుపత్రిలో అందించే సేవలతో తయారైన నమూనా, ఏలేరు కాలువ పనులు చేస్తున్న పొక్లెయిన్‌, మట్టితో తయారైన పుట్ట, పూసలతో తయారు చేసిన బొమ్మలు, పిల్లల పార్కు.. చిరు ప్రతిమలతో రూపొందించిన సంప్రదాయ బొమ్మల కొలువు ఆకట్టుకుంది. రాజమహేంద్రవరం వై-జంక్షన్‌ ప్రాంతానికి చెందిన ఎస్‌.నాగేశ్వరి దసరా సందర్భంగా ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను పదిలంగా అందించేందుకు ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తన 13వ ఏట అమ్మ ప్రోత్సాహంతో మొదలైన బొమ్మల కొలువు 45 ఏళ్లుగా కొనసాగిస్తున్నామన్నారు.

- న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

పింగాణి, మట్టితో తయారు చేసిన దేవాలయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని