logo

అయిగిరినందిని..ఆనందరూపిణి

చెడుపై మంచి సాధించిన విజయమే.. దసరా. సద్గుణాలతో మసులుకొని.. దిశ మారేలా.. దశ మెరిసేలా.. ప్రతి ఒక్కరం కార్యోన్ముఖులం కావాల్సిన శుభ తరుణమిది. దసరా.. శుభ మహోత్సవ వేళ.. ఆదిశక్తి దివ్యాశీస్సులతో ముందడుగు వేద్దాం..సకల విజయాలు సొంతం చేసుకుందాం..

Updated : 05 Oct 2022 06:08 IST

లక్ష్యంతో సాగుదాం..
లక్షణంగా అడుగేద్దాం..
నేర్పుతో నేరుద్దాం..
ఓర్పుతో జయిద్దాం..
శ్రద్ధతో శ్రమిద్దాం...
మమేకమై మెరుద్దాం..
దుర్గుణాలు వీడుదాం..
దుర్గతిని తరుముదాం...
యుక్తితో మెలుగుదాం..
స్వశక్తితో గెలుద్దాం..
శ్రమయేవ జయతే..
శమీపూజితే విజయతే..

భక్తజన సంద్రమైన రాజమహేంద్రవరం దేవీచౌక్‌

చెడుపై మంచి సాధించిన విజయమే.. దసరా. సద్గుణాలతో మసులుకొని.. దిశ మారేలా.. దశ మెరిసేలా.. ప్రతి ఒక్కరం కార్యోన్ముఖులం కావాల్సిన శుభ తరుణమిది. దసరా.. శుభ మహోత్సవ వేళ.. ఆదిశక్తి దివ్యాశీస్సులతో ముందడుగు వేద్దాం..
సకల విజయాలు సొంతం చేసుకుందాం.. మహార్నవమి వేళ దేవీ ఆలయాలు దేదీప్యమై వెలుగొందాయి.
రాజమహేంద్రవరం సాంస్కృతికం: మహిషాసురుని వధించి మానవులను కష్టాల నుంచి కాపాడిన మహిషాసురమర్దినిగా అమ్మవారు దర్శనమిచ్చారు. రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో మహర్నవమిని పురస్కరించుకుని మంగళవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. మందార, గులాబీ పూలతో అఖిలాండేశ్వరి పూజ చేశారు. బొబ్బట్లు, పులిహోర నైవేద్యం సమర్పించారు. బాలాత్రిపుర సుందరీదేవికి ఆలయ అర్చకులు కుంకుమార్చన నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని