logo

అడుగు పెట్టాలంటే హడల్‌

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధుల విభాగంలోని కుష్ఠు, టీబీ వార్డులు ఉండే భవనం దుస్థితి ఇది. శిథిల స్థితికి చేరి కూలిపోయేలా ఉంది. గోడలు బీటలు వారాయి.

Published : 28 Nov 2022 05:47 IST

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధుల విభాగంలోని కుష్ఠు, టీబీ వార్డులు ఉండే భవనం దుస్థితి ఇది. శిథిల స్థితికి చేరి కూలిపోయేలా ఉంది. గోడలు బీటలు వారాయి. స్లాబు పెచ్చులు ఊడుతోంది. మురుగుదొడ్లకు సంబంధించిన తలుపులు పూర్తిగా పాడయ్యాయి. చిన్నపాటి వర్షం కురిసినా గోడల నుంచి నీరు ఉరుతోంది. దీంతో ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ హేమలతాదేవి దృష్టికి తీసుకెళ్లగా భవనం పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించామని, ప్రాధాన్య క్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

- ఈనాడు, కాకినాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని