logo

సంప్రదాయంగా పునీతశౌరి తిరునాళ్ల

వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరు గ్రామంలో జరుగుతున్న పునీతశౌరి తిరునాళ్ల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది.

Published : 02 Dec 2022 06:25 IST

విద్యుద్దీపాల వెలుగులో పునీతశౌరి దేవాలయం

ముట్లూరు (వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరు గ్రామంలో జరుగుతున్న పునీతశౌరి తిరునాళ్ల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. శౌరివారు మరణించిన 467వ వార్షికోత్సవంగా క్రైస్తవ సోదరులు నవంబరు 24 నుంచి ఒత్తుల సమర్పణ వెలుగులతో విజ్ఞాపన ప్రార్థనలు, మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం తొలిసారిగా జరిగే క్రైస్తవుల తిరునాళ్లగా గుర్తింపు పొందడంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు హాజరవుతున్నారు.

3న గుంటూరు పీఠాధిపతుల రాక.. 3వ తేదీన నవదిన ముగింపు ప్రార్థనలలో జరిగే దివ్య పూజాబలితో ముగుస్తున్నాయి. జిల్లా క్రీస్తుమత పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే మత గురువులతో సమష్టి పూజాబలి ప్రార్థనలు ప్రారంభించనున్నారు. ఇదే రోజున తేరు ప్రదక్షిణ సంప్రదాయంగా నిర్వహించేందుకు పునీతశౌరి పుణ్యక్షేత్రం విచారణ మతగురువు మార్నేని దిలిప్‌కుమార్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. మహోత్సవాలను పురస్కరించుకుని పుణ్యక్షేత్రం ప్రహరీకి నూతనంగా దాతలు నిర్మించిన స్వాగత ద్వారాలను భాగ్యయ్య శనివారం ప్రారంభించనున్నారు. ప్రాంగణంలో నిర్మించిన పరిశుద్ధ లూర్థుమాత గృహ సముదాయాన్ని కూడా ఆయన ఆశీర్వదించి ప్రార్థనలు నిర్వహించనున్నారని విచారణ మత గురువు మార్నేని దిలిప్‌కుమార్‌ తెలిపారు. మహిళల చెక్క భజనలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని