logo

Andhra News: చిక్కీలో పురుగులు

రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం నాణ్యతా లోపంగా తయారైంది. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో.

Updated : 11 Mar 2023 10:07 IST

ఎండుగుంపాలెం (నాదెండ్ల), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం నాణ్యతా లోపంగా తయారైంది. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో ఓ లబ్ధిదారుకు ఇచ్చిన వేరుసెనగ చిక్కీ పొట్లాన్ని తెరవగా.. పురుగులు లుకలుకలాడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని సంబంధిత అంగన్‌వాడీ కార్యకర్త దృష్టికి తీసుకెళ్లారు. ఇది శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. పిల్లలందరికీ సరఫరా చేసిన చిక్కిలన్నీ బాగానే ఉన్నాయని, ఒకదానిలో మాత్రమే పురుగులు కనిపించాయని నాదెండ్ల సీడీపీవో శాంతకుమారి తెలిపారు. దీనిపై విచారించి, చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని