logo

‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’

అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు,

Published : 19 Apr 2024 05:19 IST

మాట్లాడుతున్న పెమ్మసాని చంద్రశేఖర్‌, పక్కన నాదెండ్ల మనోహర్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

కొల్లిపర, న్యూస్‌టుడే: అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, పట్టిసీమ విస్మరించారని మండిపడ్డారు. కృష్ణా డెల్టా సాగునీటిలో వాటాను ప్రశ్నించే తత్వంలేదు. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 500 రీచ్‌ల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇసుక దోపిడీపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తే 25 మంది కలెక్టర్లు పరిశీలించి ఇసుక అక్రమ తవ్వకాలు, దోపిడీ జరగలేదంటూ నివేదికలు సమర్పించటం నిజంకాదా అని ప్రశ్నించారు. ఇసుక, గ్రావెల్‌, బాక్సైట్‌ తదితర సహజ వనరుల దోపిడీ చేసి మూటకట్టిన సొమ్ము ఎటుపోతోందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. రూ.కోట్ల సంపదనిచ్చే రాజధాని అమరావతిని, పది లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కాలరాశారని మండిపడ్డారు. తెనాలి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి, జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ అభివృద్ధి పథంలో కొల్లిపర మండలాన్ని జిల్లాలో ముందుచుతామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ యువత భవిత, రాష్ట్ర ప్రయోజనాలకు పొత్తుపెట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులకు కండువాలుకప్పి స్వాగతించారు. కొల్లిపర జడ్పీటీసీ సభ్యురాలు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, నాయకులు యర్రు వెంకయ్యనాయుడు, వేణుగోపాలరెడ్డి, భీమవరపు కోటిరెడ్డి, గోవర్థనరెడ్డి, అమృతరాజు, కొండాకిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని