logo

యువనేతపై ఉప్పొంగిన అభిమానం

లోకేశ్‌ తరఫున నామినేషన్‌ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్‌ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

Published : 19 Apr 2024 05:44 IST

లోకేశ్‌ తరఫున నామపత్రాల దాఖలు

మంగళగిరిలో భారీ ర్యాలీ

మంగళగిరి, న్యూస్‌టుడే: లోకేశ్‌ తరఫున నామినేషన్‌ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్‌ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. జై లోకేశ్‌.. జైజై లోకేశ్‌ నినాదాలతో పట్టణమంతా మార్మోగింది. వీధులన్నీ అభిమానులతో కిటకిటలాడాయి. పాత మంగళగిరి సీతారామ కోవెల నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. తొలుత లోకేశ్‌ విజయాన్ని కాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు చేశారు. యువత, మహిళలు, వృద్ధులు, రాజధాని రైతులు, చేనేత వర్గాలవారు మండుటెండను సైతం లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు. యువకులు ద్విచక్ర వాహనాలతో సందడి చేశారు. డప్పు వాయిద్యాలు, నృత్యాల నడుమ ర్యాలీ స్థానిక బోసుబొమ్మ, హుస్సేన్‌ కట్ట, మిద్దె సెంటర్‌, గౌతమ బుద్ధా రోడ్డు మీదుగా తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనంలోని ఆర్వో కార్యాలయానికి చేరింది.  నేతలు నందం అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు, పంచుమర్తి ప్రసాద్‌, తాడేపల్లి, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఐక్యత చాటుతున్న తెదేపా, జనసేన, భాజపా నాయకులు

వృద్ధురాలి ఉత్సాహం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని