logo

అంతా... మా ఇష్టం

పొన్నూరు రిటర్నింగ్‌ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

Published : 24 Apr 2024 07:02 IST

పొన్నూరు పురపాలక సంఘ  కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి
గుంటూరు -బాపట్ల ప్రధాన  రహదారిలో వాహనదారుల ఇబ్బందులు

పొన్నూరు జీబీసీ రహదారిలో నిలిచిపోయిన వాహనాలు

పొన్నూరు, న్యూస్‌టుడే : పొన్నూరు రిటర్నింగ్‌ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొన్నూరు అసెంబ్లీ స్థానం 1972 సంవత్సరంలో ఏర్పడింది. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు పొన్నూరు తహశీల్దారు కార్యాలయంలోని రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్లు పత్రాలు అందజేసేవారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలు జరగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసేవారు. ఆ సమయంలో వాహనాలను షరాఫ్‌ బజార్‌, తెలగపాలెం మీదుగా గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలోకి వాహనాలు రావడంతో ఎవరికీ ఇబ్బంది కలిగేది కాదు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో తహశీల్దారు కార్యాలయం నుంచి పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయానికి మార్చారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం గుంటూరు-బాపట్ల ప్రధాన మార్గంలో ఉండటంతో వాహనాలను మరో రహదారిలోకి మళ్లించే అవకాశం లేకుండా పోయింది.

ఎన్నికల నిబంధనల ప్రకారం గుంటూరు-బాపట్ల ప్రదాన రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు నిర్మాణ పనులు సక్రమంగా చేయకపోవడంతో ఒక్కసారిగా ఒక వైపు కూలిపోయాయి. నామినేషన్లకు వివిధ రాజకీయ పార్టీల నుంచి వాహనాల్లో ఎక్కువ మంది హాజరవుతున్నారు. గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారి కావడంతోపాటు వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. ఎండలో ఉండలేక వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో కూలిపోయిన బారికేడ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని