logo

శిడిమాను ఉత్సవం..భక్త సంబరం

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో జగన్మాత పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. దూరప్రాంతాల నుంచి వేలాది మంది తరలి రావడంతో గ్రామం కిక్కిరిసింది.

Published : 01 May 2024 05:34 IST

కొండపాటూరు: కుంకుమ బండ్ల ఊరేగింపు

కొండపాటూరు(కాకుమాను), న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో జగన్మాత పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. దూరప్రాంతాల నుంచి వేలాది మంది తరలి రావడంతో గ్రామం కిక్కిరిసింది. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారు జాము నుంచి క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. మధ్యాహ్నం గ్రామంలో కుంకుమ బండ్లను పూలతో, కొబ్బరిఆకులతో అలంకరించి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. మహిళలు ప్రసాదాలు తీసుకువచ్చి భక్తులకు పంచిపెట్టారు. అనంతరం శిడి పెళ్లికొడుకు, అమ్మవారి స్వరూపమైన శిడిపోతును తోడ్కొని వచ్చి శిడిమాను బోనులో ఉంచారు. భక్తులు శిడిమానుపైకి జీడికాయలు విసిరగా..రైతులు తమ పంట ఉత్పత్తులను తీసుకువచ్చి కట్టారు. డీఎస్పీ మహబూబ్‌ బాషా, స్థానిక ఎస్సై రవీంద్ర బందోబస్తు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఈవో బత్తుల సురేష్‌ బాబు, కంఠంనేని నరేష్‌, సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల

వట్టిచెరుకూర: కొర్నెపాడులో పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. సాయంత్రం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని