logo

ఆందోళన బాటలో పండ్ల వ్యాపారులు

‘‘పండ్ల వ్యాపారం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు లేవు.. కొనుగోలుదారులు రావడం లేదు.. పైసా వ్యాపారం సాగకపోతే ఎలా బతకాలి’’ అంటూ పండ్ల వ్యాపారులు శుక్రవారం బాటసింగారంలోని గడ్డిఅన్నారం

Published : 22 Jan 2022 02:13 IST


బాటసింగారంలో పండ్ల మార్కెట్‌ కార్యాలయం ముందు వ్యాపారుల నిరసన

ఈనాడు, హైదరాబాద్‌; అబ్దుల్లాపూర్‌మెట్‌, చైతన్యపురి, న్యూస్‌టుడే: ‘‘పండ్ల వ్యాపారం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు లేవు.. కొనుగోలుదారులు రావడం లేదు.. పైసా వ్యాపారం సాగకపోతే ఎలా బతకాలి’’ అంటూ పండ్ల వ్యాపారులు శుక్రవారం బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వందలాది మంది వ్యాపారులు కార్యాలయాన్ని ముట్టడించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గడ్డిఅన్నారం నుంచి తమను బాటసింగారం తరలించడం అన్యాయమన్నారు. కేవలం 8 ఎకరాల స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నాలుగైదు షెడ్డుల్లో వ్యాపారం చేయమంటే ఎలా అంటూ నిలదీశారు. వ్యాపారానికి అనువైన కాలంలో సరైన వసతులు లేకుండా ఇక్కడ వ్యాపారం చేయడం ఎలా అంటూ వాపోయారు.  మార్కెట్‌శాఖ డిప్యూటీ డైర్టెకర్‌ పద్మహర్ష ఆధ్వర్యంలో అధికారులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా శాంతించలేదు. రెండు గంటలపాటు ఆందోళన చేసి వ్యాపారులు వెనుదిరిగారు. కొత్తపేట, నాగోలు, హయత్‌నగర్‌లలో రోడ్ల పక్కన పండ్ల వ్యాపారం చేస్తున్న వారిపై మార్కెటింగ్‌శాఖ సిబ్బంది శుక్రవారం మరోసారి ప్రతాపం చూపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని