logo

కార్మిక సంఘాలు చతికిలపడుతున్నాయి: హెచ్‌ఎంఎస్‌

దేశంలో కార్మికులకోసం కొట్లాడాల్సిన కార్మిక సంఘాలు చతికిలపడుతున్నాయని హింద్‌ మజ్దూర్‌ సభ (హెచ్‌ఎంఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్‌ అహ్మద్‌ అన్నారు.

Published : 29 Jan 2022 03:32 IST


నినాదాలు చేస్తున్న హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర నాయకత్వం, ఎన్నికైన గ్రేటర్‌ కార్యవర్గం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: దేశంలో కార్మికులకోసం కొట్లాడాల్సిన కార్మిక సంఘాలు చతికిలపడుతున్నాయని హింద్‌ మజ్దూర్‌ సభ (హెచ్‌ఎంఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్‌ అహ్మద్‌ అన్నారు. హెచ్‌ఎంఎస్‌ పోరాటమే ఊపిరిగా ముందుకు సాగుతుందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం హెచ్‌ఎంఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు కార్మిక సంఘాలు రాజకీయ పార్టీల నీడన బతుకుతూ కార్మికుల సమస్యల్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి రెబ్బ రామారావు మాట్లాడుతూ ఫిబ్రవరి 23, 24 జరుగనున్న దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తామని ప్రకటించారు. కార్యవర్గంలో అధ్యక్షుడిగా కె.రాజు, ఉపాధ్యక్షులుగా ఎ.హరి, సి.మహేష్‌, జె.అశోక్‌, కె.నర్సింగరావు, ఎండీ అక్బర్‌, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్‌ అంజద్‌, కార్యదర్శులుగా నవీన్‌ కాంత్‌, టి.గీతారాణి, సి.జనార్దన్‌, డి.పద్మ, బాబు, కోశాధికారిగా ఎ.సుధాకర్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని