logo

Samatha Murthy: సమతాస్ఫూర్తి కేంద్రం.. ఇలా చేరుకుందాం..

రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలను వీక్షించేందుకు రావాలంటే అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.జేబీఎస్‌ నుంచి చేరుకునేలా.. నంబరు 455 బస్సు ఎక్కి శంషాబాద్‌కు చేరుకోవచ్చు.

Updated : 02 Feb 2022 06:57 IST

సమతా స్ఫూర్తి: ప్రాంగణంలో శ్రీరామానుజాచార్యుడి విగ్రహం

ఈనాడు, హైదరాబాద్‌ - శంషాబాద్‌, న్యూస్‌టుడే: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలను వీక్షించేందుకు రావాలంటే అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
జేబీఎస్‌ నుంచి చేరుకునేలా.. నంబరు 455 బస్సు ఎక్కి శంషాబాద్‌కు చేరుకోవచ్చు. లేదా ఉప్పల్‌కు చేరుకుని 300 నంబరు బస్సు ఎక్కి ఆరాంఘర్‌కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి శంషాబాద్‌ మీదుగా తొండుపల్లి, ఘాన్సిమియాగూడ, పెద్దషాపూర్‌, మదనపల్లి బస్టాప్‌ నుంచి శ్రీరామనగరం చేరుకోవచ్చు.
ఎంజీబీఎస్‌ నుంచి..  షాద్‌నగర్‌ వెళ్లే బస్సు ఎక్కాలి. మదనపల్లి వద్ద దిగి ఆటోలో శ్రీరామ నగరానికి చేరుకోవచ్చు.  

ప్రవేశ ద్వారం

రైల్వే స్టేషన్‌ నుంచి... రైళ్లలో కాచిగూడలో దిగితే 2, 3 నంబరు బస్సు ఎక్కి అఫ్జల్‌గంజ్‌కు చేరుకుని అక్కడి నుంచి శంషాబాద్‌, షాద్‌నగర్‌ బస్సులలో మదనపల్లికి చేరుకోవాలి. సికింద్రాబాద్‌లో దిగిన ప్రయాణికులు 251 నంబరు బస్సు ఎక్కి శంషాబాద్‌ రావచ్చు. లేదా జేబీఎస్‌కు చేరుకుని శంషాబాద్‌ చేరుకోవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దిగితే 7, 8, 9 నంబరు బస్సులో అఫ్జల్‌గంజ్‌కు వెళ్లవచ్చు.
వరంగల్‌, విజయవాడ నుంచి ఔటర్‌ మీదుగా వస్తే...  పెద్దగోల్కొండ జంక్షన్‌ వద్ద దిగితే ఎడమ వైపు పీ-1 రోడ్డు మీదుగా.. తొండుపల్లి ఔటర్‌ జంక్షన్‌ వద్ద దిగి గండిగూడ, ఘాన్సిమియాగూడ, పెద్దషాపూర్‌, మదనపల్లి మీదుగా శ్రీరామనగరానికి వెళ్లొచ్చు. పటాన్‌చెరు, మహారాష్ట్ర నుంచి అవుటర్‌ రింగు రోడ్డు మీదుగా తొండుపల్లి జంక్షన్‌ వద్ద కిందకు దిగి  కేంద్రానికి చేరుకోవచ్చు.


14వ తేదీ వరకూ ప్రత్యేక బస్సులు

ఈనాడు, హైదరాబాద్‌: ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు ఈనెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.  
ఉదయం 6 గంటలు, 7 గంటలకు..
* పఠాన్‌చెరు - లింగంపల్లి - గచ్చిబౌలి - శంషాబాద్‌  * కేపీహెచ్‌బీ కాలనీ - కూక్‌ట్‌పల్లి - ఎస్‌ఆర్‌నగర్‌ - పంజాగుట్ట - మెహిదీపట్నం * మేడ్చెల్‌ - కొంపల్లి - బాలానగర్‌ - మెహిదీపట్నం  * అల్వాల్‌ - జేబీఎస్‌ - ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ - అఫ్జల్‌గంజ్‌ - జూపార్కు* ఘట్కేసర్‌ - ఉప్పల్‌ - ఎల్‌బీనగర్‌ - మిథాని  * ఈసీఐఎల్‌ - తార్నాక - ఫీవర్‌ ఆసుపత్రి - నారాయణగూడ - లక్డీకాపూల్‌ - మెహిదీపట్నం  * హయత్‌నగర్‌ - దిల్‌సుఖ్‌నగర్‌ - ఎంజీబీఎస్‌
రైల్వేస్టేషన్ల నుంచి 6, 7, 8 గంటలకు..
*  కాచిగూడ రైల్వేస్టేషన్‌ - అఫ్జల్‌గంజ్‌ - జూపార్కు   * నాంపల్లి రైల్వే స్టేషన్‌ - అఫ్జల్‌గంజ్‌ - జూపార్కు  
* సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ - ఆర్టీసీ క్రాస్‌రోడ్సు - ఫీవర్‌ ఆసుపత్రి - అఫ్జల్‌గంజ్‌ - జూపార్కు మీదుగా బస్సులు ఆరాంఘర్‌ - ముచ్చింతల్‌ నుంచి వెళతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు