logo

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు రాయండి

నేటి నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారిణి (డిఈఓ) రేణుకాదేవి తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు

Published : 23 May 2022 01:20 IST

‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో డీఈఓ రేణుకాదేవి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: నేటి నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారిణి (డిఈఓ) రేణుకాదేవి తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని సైతం నియమించామని ఆమె అన్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆదివారం ఆమె ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు.

ప్ర: ఎన్ని కేంద్రాలున్నాయి. ఎంత మంది విద్యార్థులున్నారు.

జ: జిల్లా వ్యాప్తంగా 70 కేంద్రాలను ఏర్పాటు చేశాం. మొత్తం 14,441 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలురు 7,272, బాలికలు 7,169 ఉన్నారు. 70 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 70 మంది డిపార్టుమెంట్‌ అధికారులు, 1,050 మంది ఇన్విజిలేటర్లను పరీక్షల నిర్వహణకు నియమించాం.

ప్ర: మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఏంచేశారు.

జ: ఈసారి పరీక్షలలో ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌, పేపర్‌ లీకేజ్‌ లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయిస్తున్నాం. మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశాం.

ప్ర: విద్యార్థులకు మీరిచ్చే సలహా..

జ: విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. సాధారణ దుస్తులు ధరించి మాత్రమే పరీక్షలకు హాజరు కావాలి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు వెంట తీసుకురావొద్ధు

ప్ర: ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు.

జ: ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు పోలీసుల పర్యవేక్షణలో పరీక్షా కేంద్రాలకు వస్తాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాల సీల్‌ తెరుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని