logo

ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తామని రూ.10 లక్షలు మోసం

నీట్ పరీక్ష రాసి మెడికల్ సీట్ రాని వాళ్లే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.ఈ కేసుకు సంబంధించిన..

Published : 25 May 2022 17:52 IST

హైదరాబాద్: నీట్ పరీక్ష రాసి మెడికల్ సీట్ రాని వాళ్లే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబర్‌ క్రైం డీసీపీ గజారావు భూపాల్ మీడియాకు వెల్లడించారు.

‘‘హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి నీట్ పరిక్ష రాసింది. కౌన్సెలింగ్‌లో ఆమెకు మెడికల్ సీట్ రాలేదు. తక్కువ రేటులో బెంగళూరులోని కెంపెగౌడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సీటు ఇప్పిస్తామని అమ్మాయి ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. స్పందించిన యువతి తల్లిదండ్రులు సీటు కోసం అతను ఆడిగిన రూ. 10.16 లక్షలు నిందితుడు తెలిపిన ఖాతాలో జమ చేశారు. తర్వాత సీటు రాకపోవడం, డబ్బు తీసుకున్న వ్యక్తి స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బిహార్‌కు చెందిన ముఠా ఈ నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడు నేపాల్‌లో ఉన్నట్లు తెసుకున్న పోలీసులు బోర్డర్ పోలీసుల సాయంతో అరెస్టు చేసి నగరాని తీసుకొచ్చారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు’’ అని డీసీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని