logo

నేత్రపర్వం.. ఎల్లమ్మ పరిణయం

చూడ ముచ్చటైన అమ్మవారి దివ్యరూపం.. పక్కనే త్రిశూల రూపంలో పెళ్లి కుమారుడిగా ఆశీనులైన జమదగ్ని మహర్షి.. మంగళ తోరణాలు, భాజాభజంత్రీల చప్పుళ్లు, వేద పండితుల మంత్రోచ్ఛరణల....

Published : 06 Jul 2022 02:40 IST

బల్కంపేటకు పోటెత్తిన భక్తులు


కల్యాణ క్రతువు జరిపిస్తున్న వేద పండితులు

అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే: చూడ ముచ్చటైన అమ్మవారి దివ్యరూపం.. పక్కనే త్రిశూల రూపంలో పెళ్లి కుమారుడిగా ఆశీనులైన జమదగ్ని మహర్షి.. మంగళ తోరణాలు, భాజాభజంత్రీల చప్పుళ్లు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం ఉదయం 11.45 గంటలకు అమ్మవారి వివాహ ఘట్టాన్ని వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పోలీసు యంత్రాంగం సహకారంతో భారీగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల నుంచే అమ్మవారికి మంగళ ద్రవ్యాల సమర్పణ, యజ్ఞోపవీతం, మహా సంకల్పం తర్వాత పండితులు అమ్మవారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ మాలోత్‌ కవిత, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. భాగ్యనగర్‌ మహంకాళీ బోనాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించారు.


అమ్మవారికి మొక్కుతున్న ఉపమేయర్‌ శ్రీలతారెడ్డి, ఎంపీ కవిత, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి,
మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ దంపతులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని