logo

క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్ట్‌

క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు రూ.19 లక్షలు మోసగించిన ముగ్గురు వ్యక్తులను పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు.

Published : 06 Aug 2022 01:52 IST

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు రూ.19 లక్షలు మోసగించిన ముగ్గురు వ్యక్తులను పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు. సీఐ ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన కన్నం రవితేజ(27) ఆసక్తి ఉన్న వారి నుంచి క్రిప్టో కరెన్సీ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. కొంపల్లిలోని ఐవిజన్‌ అపార్టుమెంట్‌కు చెందిన ఓ వ్యక్తి ఇతని క్రిప్టో కరెన్సీలో మొదటిసారి రూ.79 వేలు, మరోసారి రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టి లాభాలు పొందారు. దాంతో మరింత పెట్టుబడి పెట్టాడు. అలా రూ.19 లక్షలు లాభాలు వచ్చాయి. వాటిని రవితేజ బాధితుడి అకౌంట్‌లోకి బదిలీ చేయకుండా మోసగించాడు. ఈ మేరకు బాధితుడు ఈ నెల 2న పేట్‌బషీరాబాద్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. రవితేజ క్రిప్టో కరెన్సీ పేరుతో పలువురిని మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. అతడి సహాయకులు గోవాకు చెందిన సతీష్‌పాండే(28) విజయవాడ నివాసి సబ్బిషెట్టి ఫణికుమార్‌(24) ముగ్గురూ విజయవాడ నుంచి గురువారం గోవా వెళ్లటానికి నగరానికి వచ్చి ప్రయాణం ఆలస్యం కావటం వల్ల కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ లాడ్జిలో ఉన్నారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో విశాఖపట్నానికి సతీష్‌కుమార్‌(40), విజయవాడకు చెందిన సునీల్‌కుమార్‌(29) ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వారిద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని