logo

పుస్తక భారం..నెలకో రోజు దూరం!

ఒకటో తరగతిలో బండెడు పుస్తకాలు.. సంచిని మోయలేక బుడతల అవస్థలు.. వెన్నెముకపై ప్రభావం పడుతోందంటున్న నిపుణులు.. బరువు తగ్గించాలని  సూచిస్తున్నారు. ఈ దిశలో నగరానికి చెందిన పలు పాఠశాలలు కసరత్తు చేస్తున్నాయి. బోయిన్‌పల్లిలోని

Updated : 09 Aug 2022 04:32 IST

సరికొత్త విధానం ప్రవేశపెట్టిన సెయింట్‌ పీటర్‌ ఉన్నత పాఠశాల

ఈనాడు, హైదరాబాద్‌: ఒకటో తరగతిలో బండెడు పుస్తకాలు.. సంచిని మోయలేక బుడతల అవస్థలు.. వెన్నెముకపై ప్రభావం పడుతోందంటున్న నిపుణులు.. బరువు తగ్గించాలని  సూచిస్తున్నారు. ఈ దిశలో నగరానికి చెందిన పలు పాఠశాలలు కసరత్తు చేస్తున్నాయి. బోయిన్‌పల్లిలోని సెయింట్‌ పీటర్‌ ఉన్నత పాఠశాల వినూత్న ప్రయోగం చేపట్టింది. ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు నెలకోసారి పిల్లలు పుస్తకాల సంచి లేకుండా పాఠశాలకు వచ్చే విధానం తీసుకొచ్చింది. దీంతో దాదాపు 2500 మంది విద్యార్థులు ఉపశమనం పొందుతున్నారు.
మంచి స్పందన.. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో.. ఏటా పది రోజులు పుస్తకాల సంచి లేకుండా పిల్లలు బడికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. పుస్తక సంచి విద్యార్థి బరువులో పది శాతానికి మించకూడదని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి. హోం వర్క్‌, క్లాస్‌వర్క్‌ల కారణంగా ఎన్నో పుస్తకాలు రోజూ పిల్లలు ఇంటికి తీసుకెళ్లడం.. బడికి తీసుకురావడం చేస్తుంటారు. వాటిని మోయలేక యాతన పడుతుంటారు. తల్లిదండ్రులు సహకరిస్తున్నా.. ఎంతో కొంత దూరం మోయక తప్పడం లేదు. ‘‘చదువును ఇష్టపడేలా చేయాలనేది మా ప్రయత్నం. అన్ని రోజులు పుస్తకాలు సంచి తీసుకురాకుండా ఉండడమంటే కుదరదు. కొన్ని రోజులైనా ఈ విధానం ఉండాలని ప్రయత్నిస్తున్నాం. పిల్లలు ఎంతో ఇష్టపడుతున్నారు. హోంవర్క్‌ చేయాల్సిన అవసరం ఉండటం లేదు.’’ అని సెయింట్‌ పీటర్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ కె.సువర్ణ తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని