logo

సీఎం కార్యక్రమానికి కట్టుదిట్ట చర్యలు: కలెక్టర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 14న జిల్లా పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పాలనాధికారిణి నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా నూతన కలెక్టర్‌ కార్యాలయ భవనం,...

Updated : 11 Aug 2022 04:05 IST


సభాస్థలి పటం (మ్యాప్‌) పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిఖిల, ఎమ్మెల్యే ఆనంద్‌, ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 14న జిల్లా పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పాలనాధికారిణి నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా నూతన కలెక్టర్‌ కార్యాలయ భవనం, హెలీప్యాడ్‌, బహిరంగ సభా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెలీప్యాడ్‌ను ఎస్పీ కార్యాలయంలో, బహిరంగ సభా ప్రాంగణాన్ని నూతన కలెక్టర్‌ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేయాలన్నారు. తెరాస పార్టీ కార్యాలయాన్ని పరిశీలించి రోడ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కలెక్టర్‌ కార్యాలయ భవనాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో, పూలతో అందంగా అలకరించాలని సూచించారు. అనంతరం వివిధ శాఖల అధికారులకు వారు చేపట్టాల్సిన పనులను కేటాయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్‌, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పక్కాగా బందోబస్తు విధులు: ఎస్పీ

వికారాబాద్‌, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ ఈ నెల 14న వికారాబాద్‌ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి తెలిపారు. బుధవారం పోలీసు కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కాన్వాయికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, సంఘ విద్రోహ శక్తులను ముందుగానే పసిగట్టి అదుపులోకి తీసుకోవాలని తెలిపారు. బందోబస్తు విధుల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదన్నారు. సిబ్బందికి ప్రముఖులు వచ్చే మార్గం (రూట్‌ మ్యాప్‌) గురించి వివరించారు. అనంతరం వజ్రోత్సవాలను పురస్కరించుకొని కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌, వికారాబాద్‌, తాండూర్‌, పరిగి డీఎస్పీలు సత్యనారాయణ, శేఖర్‌గౌడ్‌, కరుణాసాగర్‌రెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, ధారూర్‌, మోమిన్‌పేట సీఐలు శ్రీనివాస్‌, రాజేందర్‌రెడ్డి, వెంకట్రామయ్య, తిరుపతిరాజు, వెంకటేశం, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని