logo

ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఛైర్మన్‌

ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సింగరి సుదర్శన్‌(82) అనారోగ్యంతో మృతిచెందారు. దేశంలోనే పెద్ద గణపతిగా ఖైరతాబాద్‌ వినాయకుడికి గుర్తింపు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Published : 02 Oct 2022 04:13 IST

సింగరి సుదర్శన్‌ కన్నుమూత

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సింగరి సుదర్శన్‌(82) అనారోగ్యంతో మృతిచెందారు. దేశంలోనే పెద్ద గణపతిగా ఖైరతాబాద్‌ వినాయకుడికి గుర్తింపు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఖైరతాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల్లో తొలుత ఆయన సోదరుడు, అప్పటి కౌన్సిలర్‌ సింగరి శంకరయ్య ఒక్క అడుగు విగ్రహంతో వేడుకలు ప్రారంభించారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన సుదర్శన్‌ 65 అడుగుల ఎత్తు వరకు గణనాథుడి విగ్రహాన్ని చేయించి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి ఆసుపత్రిలో కన్నుమూశారు. సమాచారం అందుకున్న మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, తెరాస నేత మన్నె గోవర్ధన్‌ తదితరులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆయన కుటుంబీకులనూ పరామర్శించి సానుభూతి తెలిపారు. సాయంత్రం పంజాగుట్ట శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల్లో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సుదర్శన్‌ మృతి పట్ల హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని