logo

మీటర్లు నామమాత్రం..ప్రయాణికులకు భారం

‘‘సార్‌.. నేను రూ.300 అడిగా.. రూ.250 ఇచ్చేయ్యండి... మీటర్‌, గీటర్‌ ఇక్కడేం ఉండదు. ఎక్కువనుకుంటే.. ఓలా, ఉబెర్‌, రాపిడో బుక్‌ చేసుకోండి’’ - ఖైరతాబాద్‌ కూడలి నుంచి బస్టాండ్‌ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, ఆటోడ్రైవర్‌ మధ్య సంభాషణ ఇది.

Published : 04 Oct 2022 03:04 IST

పనిచేయని ఆటోమీటర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘సార్‌.. నేను రూ.300 అడిగా.. రూ.250 ఇచ్చేయ్యండి... మీటర్‌, గీటర్‌ ఇక్కడేం ఉండదు. ఎక్కువనుకుంటే.. ఓలా, ఉబెర్‌, రాపిడో బుక్‌ చేసుకోండి’’ - ఖైరతాబాద్‌ కూడలి నుంచి బస్టాండ్‌ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, ఆటోడ్రైవర్‌ మధ్య సంభాషణ ఇది.

ఆటో డ్రైవర్లు మీటర్‌ వేయకుండా.. దూరం ఆధారంగా రూ.వంద, రూ.రెండు వందలు అడుగుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మీటర్‌ ధరలను నిర్ణయించాల్సిన రవాణా శాఖ, మీటర్లకు సీల్‌ వేయాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆటో ఛార్జీలు భారంగా మారాయి. ఆటోవాలాలు మీటర్‌ ప్రకారం ఛార్జీలు వసూలు చేసుకోవాలంటే.. రవాణాశాఖ కిలోమీటర్‌కు ఇంతని ధరలు నిర్ణయించాలి. రవాణాశాఖ అధికారులు మీటర్‌ ధరలను ఐదేళ్ల క్రితం సవరించారు. ఇంధన ధరలకు అనుగుణంగా మార్చాలని అనుకున్నప్పటికీ, కరోనా ప్రభావంతో పక్కన పెట్టేశారు. ఇక మీటర్ల పనితీరుపై తనిఖీలూ చేయడం లేదు.

రాయితీలు..

రాజధాని నగరంలో సుమారు 1.50 లక్షల ఆటోలు ఉన్నాయి. వీటిల్లో 70 శాతం మంది ఓలా, ఉబెర్‌, రాపిడోల్లో చేరారు. కమీషన్‌తో పాటు సవారీ వెళ్లినందుకు ఆయా సంస్థల నుంచి డబ్బు వస్తుండడంతో.. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోండని ప్రయాణికులకు వారే సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులకూ ఆయా సంస్థలు రాయితీలు ఇస్తున్నాయి. అయితే స్మార్ట్‌ ఫోన్లు లేని వారు.. ఉన్నా యాప్‌లు లేని వారు, వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చే వేలాది మంది ప్రజలు, ప్రయాణికులు మాత్రం ఆటోడ్రైవర్లు డిమాండ్‌ చేసిన డబ్బులు ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని