logo

మరమ్మతులు లేక 192 ఎకరాల బీడు

చెరువులు నిండి పారితే ఆయకట్టు కింద ఉన్న చివరి పంట పొలాలకు నీరు అందేలా గతంలో కత్వలు నిర్మించారు. కాల క్రమేణ సరైన సమయంలో వర్షాలు లేక చెరువులు నిండక, మరమ్మతులకు నోచుకోక కత్వల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.  

Published : 29 Nov 2022 04:50 IST

గచ్చుకత్వ లీకేజీతో వృథాగా పారుతున్న నీరు

న్యూస్‌టుడే, దౌల్తాబాద్‌: చెరువులు నిండి పారితే ఆయకట్టు కింద ఉన్న చివరి పంట పొలాలకు నీరు అందేలా గతంలో కత్వలు నిర్మించారు. కాల క్రమేణ సరైన సమయంలో వర్షాలు లేక చెరువులు నిండక, మరమ్మతులకు నోచుకోక కత్వల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.  

220 ఎకరాల ఆయకట్టు

దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింది గచ్చుకత్వ, తాళ్లమామిడి కత్వలు నిర్మించారు. వీటి కింద సుమారు 220 ఎకరాల ఆయకట్టు సాగయ్యేది. ప్రస్తుతం లీకేజీలు, అక్కడక్కడ ధ్వసం కావడంతో నీరు నిల్వడం లేదని రైతులు తెలిపారు.  మూడేళ్లుగా మంచి వర్షాలు కురుస్తున్నా నీటిని వినియోగించుకోలేక పోతున్నామన్నారు. దౌల్తాబాద్‌ రైతులతో పాటు నందారం, యాంకి గ్రామాల రైతులకూ కత్వల ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. వర్షపు నీరు కత్వల నుంచి ఫిబ్రవరి చివరి వరకు పారేది. కత్వలకు మరమ్మతులు చేపడితే సుమారు 150 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.  

ప్రతిపాదనలు పంపించాం: డీఈ కరణ్కుమార్‌

మరమ్మతుల విషయమై నివేదికలు తయారుచేసి ప్రభుత్వ అనుమతుల కోసం పంపించాం. వచ్చిన వెంటనే పనులు చేయిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని