logo

కాలేయం, పిత్తాశయంలో వెయ్యికిపైగా రాళ్లు

పిత్తాశయం, కాలేయం, పిత్తవాహికలో ఏర్పడిన వెయ్యికిపై రాళ్లను తొలగించారు. మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రి వైద్యులు.. 250 గ్రాముల బరువున్న రాళ్లను తొలగించి రోగి ప్రాణాలను నిలబెట్టారు.

Published : 07 Dec 2022 03:58 IST

మాదాపూర్‌: పిత్తాశయం, కాలేయం, పిత్తవాహికలో ఏర్పడిన వెయ్యికిపై రాళ్లను తొలగించారు. మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రి వైద్యులు.. 250 గ్రాముల బరువున్న రాళ్లను తొలగించి రోగి ప్రాణాలను నిలబెట్టారు. కన్సల్టెంట్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ కిషోర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ‘‘పశ్చిమబెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఆసుపత్రిలో చేరగా..  కాలేయం, పిత్తాశయం, పిత్తవాహికలో రాళ్లు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించాం. రోగి కొలిసిస్టెక్టమీ (పిత్తాశయం తొలగింపు) చేసి ప్రధాన పిత్తవాహిక తెరిచి రాళ్లను బయటకు తీశాం. కాలేయం, ప్రాక్సిమల్‌ నాళాల నుంచి పిత్తవాహిక ద్వారా మరికొన్ని రాళ్లను తీశాం. అనంతరం ప్రధాన పిత్తవాహికను పేగుతో కలిపి విజయవంతంగా సర్జరీ పూర్తి చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని