logo

ఫీజు కట్టడమే పదివేలు!

ఉస్మానియా వర్సిటీ పరిధిలో బ్యాక్‌లాగ్‌ పరీక్షలు రాసే విద్యార్థులపై పెద్ద పిడుగు. పరీక్ష ఫీజు రూపంలో ఆర్థికంగా తీవ్ర భారాన్ని వర్సిటీ మోపింది.

Published : 09 Dec 2022 04:43 IST

2010 నుంచి బ్యాక్‌లాగ్స్‌ రాసేందుకు ఓయూ అవకాశం
ఒక్కో పేపర్‌కు ఏకంగా  రూ.10 వేలు వసూలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీ పరిధిలో బ్యాక్‌లాగ్‌ పరీక్షలు రాసే విద్యార్థులపై పెద్ద పిడుగు. పరీక్ష ఫీజు రూపంలో ఆర్థికంగా తీవ్ర భారాన్ని వర్సిటీ మోపింది. నిర్దేశిత పరీక్ష ఫీజుతోపాటు పీనల్‌ ఛార్జీల పేరిట ఒక్కొక్క పేపర్‌కు రూ.10వేలు చెల్లించాలని నిర్దేశించింది. 12 ఏళ్లుగా పీజీ కోర్సుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్స్‌ పూర్తి చేసేందుకు ‘వన్‌టైమ్‌ ఛాన్స్‌’కు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇటీవల అవకాశం కల్పించింది. గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2010-2017 మధ్యకాలంలో చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకునే వీలుంది.

దరఖాస్తుకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జనవరి 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొ.శ్రీనగేశ్‌ తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో జనవరి 17 వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. అన్ని పేపర్లకు కలిపి రూ.1950తోపాటు మెమోకు రూ.100 కలుపుకొని రూ.2050, రెండు పేపర్లకు రూ.1060 ఫీజుతోపాటు మెమోకు రూ.100 కలుపుకొని రూ.1160 చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా పేపర్‌కు రూ.10వేలు చెల్లించాల్సి ఉండటంతో పరీక్ష ఫీజు ఆర్థికంగా తీవ్ర భారం కానుందని విద్యార్థులు వాపోతున్నారు. ఎవరైనా విద్యార్థికి రెండు పేపర్లు ఉంటే రూ.21,160 కట్టాల్సిన పరిస్థితి. దీంతో ఫీజులను చూసి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని