logo

లింగ వివక్ష లేని సమాజం అవసరం: ఎస్పీ

లింగ వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి తెలిపారు. గురువారం లింగ వివక్ష లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం సందర్భంగా వికారాబాద్‌ పట్టణంలోని బీజేఆర్‌ చౌరస్తా నుంచి ఎమ్మార్పీ చౌరస్తా వరకు నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 09 Dec 2022 04:58 IST

ర్యాలీలో పాల్గొన్న కోటిరెడ్డి, మున్సిపల్‌ అధ్యక్షురాలు మంజుల తదితరులు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: లింగ వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి తెలిపారు. గురువారం లింగ వివక్ష లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం సందర్భంగా వికారాబాద్‌ పట్టణంలోని బీజేఆర్‌ చౌరస్తా నుంచి ఎమ్మార్పీ చౌరస్తా వరకు నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల లింగ వివక్ష చూపకుండా పిల్లలను సమానంగా చూడటంతో పాటు అవకాశాలు కల్పించాలన్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ముందుకు రావాలని, నవంబరు 25 నుంచి ఈ నెల 23 వరకు మహిళలు, పిల్లల భద్రత విభాగం, పోలీసుశాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాలను హెల్ప్‌లైన్‌ నంబర్లు 100, 112, 1098లకు ఫోన్‌ చేసి తెలపాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌, వికారాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు శ్రీను, ప్రమీల, దాసు, పురపాలక అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని