logo

అధికారంలోకి వస్తే రూ.3వేల పింఛను: భాజపా

భాజపా అధికారంలోకి వస్తే రూ.3వేల పింఛన్‌ ఇస్తామని మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు.

Published : 03 Feb 2023 01:42 IST

మాట్లాడుతున్న మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

న్యూస్‌టుడే, తాండూరు: భాజపా అధికారంలోకి వస్తే రూ.3వేల పింఛన్‌ ఇస్తామని మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. తాండూరులో గురువారం నిర్వహించిన జిల్లా భాజపా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యకర్తలు బూత్‌ కమిటీ స్థాయి నుంచి పది నెలలు కష్టపడి భాజపాను అధికారంలోకి తీసుకు వస్తేనే ఇది సాధ్యమౌతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం రూ.80వేల కోట్లుగా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం రూ.2.70 లక్షల కోట్లతో బడ్జెట్‌ ఎలా పెడతారన్నారు. కేంద్ర నిధులను దుబారా చేస్తున్నారని విమర్శించారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగుతుందని తెలిపారు. జిల్లా భాజపా అధ్యక్షుడు సదానందరెడ్డి, ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌ కుమార్‌, రాష్ట్ర నాయకులు అశ్వత్థామ రెడ్డి, భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రహ్లాదరావు, తాండూరు నియోజకవర్గం నాయకులు నరేష్‌ మహరాజ్‌, అసెంబ్లీ కన్వీనర్‌ రజనీకాంత్‌, కొడంగల్‌ నియోజక వర్గ భాజపా నాయకుడు పున్నమ్‌ చంద్‌ లాహోటీ, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీలత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లలిత, మున్సిపల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని