logo

సమైక్య పోరుతోనే సమస్యల పరిష్కారం

రాష్ట్రంలో గిరిజనులు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్‌ అన్నారు.

Published : 06 Feb 2023 00:52 IST

మాట్లాడుతున్న గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్‌, ప్రజా ప్రతినిధులు

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గిరిజనులు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్‌ అన్నారు. ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద గిరిజన సంఘం జెండాను ఎగురవేసి 2వ జిల్లా మహాసభలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నేరవేర్చటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. నిరుద్యోగ భృతిని ప్రకటించి అమలు చేయటం లేదన్నారు. తక్షణమే ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతిని ప్రకటించాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, నాయకులు కె. మహేష్‌, లక్ష్మణ్‌, శాంతి, అర్చన, మాణిక్‌ పాల్గొన్నారు.


జిల్లా కమిటీ నియామకం

గిరిజన సంఘం జిల్లా అధ్యక్షునిగా జె.శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా వెంకట్రాములు, ఉపాధ్యక్షునిగా వి.లక్ష్మణ్‌, మహేష్‌, సహాయ కార్యదర్శులుగా మాణిక్‌; రాందాస్‌, అర్చన, శాంతి, నికిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని