సిట్టింగ్ జడ్జితో విచారణ అవసరం: భాజపా
గ్రూప్-1 పరీక్షల్లో లీకేజీపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎ.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్
వికారాబాద్‌టౌన్, న్యూస్‌టుడే: గ్రూప్-1 పరీక్షల్లో లీకేజీపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎ.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, నాయకులు పాండుగౌడ్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. * పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సోమవారం భాజపా ఆధ్వర్యంలో శక్తికేంద్ర సమ్మేళనం నిర్వహించారు.
పరిగి: ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూనేటి కిరణ్, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్, అసెంబ్లీ కన్వీనర్ నర్సింహ్మా, జిల్లా కార్యదర్శి పెంటయ్య, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు ఎం.యాదయ్య డిమాండ్ చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంబేడ్కర్ కూడలి వద్ద భాజపా ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు. జిల్లా అధికార ప్రతినిధి బాలకృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రాజు, పట్టణాధ్యక్షుడు శ్రీశైలం తదితరులున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్