TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌.. లావాదేవీలపై సిట్‌ ఆరా

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఆరు రోజుల కస్టడీలో భాగంగా ఐదో రోజు నిందితులను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు.

Published : 22 Mar 2023 12:30 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఆరు రోజుల కస్టడీలో భాగంగా ఐదో రోజు నిందితులను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. నిందితులు రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌, రేణుక దంపతుల బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా జరిగిన లావాదేవీలపై సిట్‌ బృందం ఆరా తీస్తోంది. 

మంగళవారం ఏపీపీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శంకరలక్ష్మి నుంచి మరికొన్ని వివరాలు సేకరించిన సిట్‌.. ఆమె చెప్పిన వివరాలతో నేడు ప్రవీణ్‌ణు విచారిస్తోంది. టీఎస్‌పీఎస్సీలోని మరికొంతమంది ఉద్యోగులకు కూడా నోటీసుల ఇచ్చేందుకు సిట్‌ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితులతో సంప్రదింపులు జరిపిన వారి కాల్‌ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని