చిరువ్యాపారులకు.. వీధిబజార్
చిరు, తోపుడుబల్ల వ్యాపారులకు బల్దియా మార్గం చూపుతోంది. అందుకు హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ చెంత.. వంతెన కింద ఉన్న స్థలాన్ని కేటాయించింది.
హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ చెంత ఏర్పాట్లు
వంతెన కింద సిద్ధమవుతున్న స్టాళ్లు
ఈనాడు - హైదరాబాద్: చిరు, తోపుడుబల్ల వ్యాపారులకు బల్దియా మార్గం చూపుతోంది. అందుకు హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ చెంత.. వంతెన కింద ఉన్న స్థలాన్ని కేటాయించింది. కూకట్‌పల్లి మోడల్ రైతుబజారు నిర్మిస్తున్నప్పుడు వంతెన కింద తాత్కాలికంగా రైతుబజారును ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడేళ్లు రైతుబజారు నడిచింది. భూగర్భ కేబుళ్లు వేసి.. డిజిటల్ కాంటాలు, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చారు. అయితే అవేవీ అమలవ్వలేదు. తాత్కాలిక మార్కెట్ కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కాని రైతుబజార్లకు ఉద్దేశించిన ప్లాట్‌ఫామ్‌లను ఇప్పుడు చిరు వ్యాపారులకు వినియోగించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదించడంతో కార్యక్రమం ముందుకెళ్తోంది.
ఎకరానికి పైగా స్థలంలో..
హైటెక్‌సిటీ రైల్వే వంతెన కింద ఎకరానికి పైగా స్థలం ఉంది. ఇక్కడ 250 రైతుబజారు దుకాణాలు నడిచేవి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రైతుబజారును కూకట్‌పల్లిలో కొత్తగా నిర్మించిన మోడల్ రైతుబజారుకు తరలించారు. దీంతో ఇక్కడ ఖాళీ అయ్యింది. ఇక్కడ 300 వరకూ తోపుడు బళ్లను పెట్టుకొని ‘స్ట్రీట్ ఫుడ్’ సెంటర్‌గా మార్చడానికి అవకాశం ఉంది. ఇందుకు కొంత అద్దెను కూడా వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో వీధి పక్కన వ్యాపారాలు చేసుకునే తోపుడుబళ్లవారు వెనుకా ముందు అవుతున్నారని పలువురు ముందుకు వచ్చిన వ్యాపారులు చెబుతున్నారు. అద్దె సాధారణంగా ఉంటే.. అందరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు వ్యాపారం సాఫీగా.. సాగుతుందని యాదగిరి అనే చిరు వ్యాపారి చెబుతున్నారు. కొంతమంది ఇప్పటికే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ నాటికి ఈ స్ట్రీట్ ఫుడ్ కేంద్రం అందుబాటులోకి వస్తుందని స్థానిక బల్దియా అధికారులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు