logo

నగరం నుంచి పెరుగుతున్న వీసా దరఖాస్తులు

హైదరాబాద్‌లో వీసా దరఖాస్తుల సంఖ్య కొవిడ్‌ మునుపటి స్థాయులకు చేరుకుంటోంది.

Published : 29 Mar 2023 02:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వీసా దరఖాస్తుల సంఖ్య కొవిడ్‌ మునుపటి స్థాయులకు చేరుకుంటోంది. కొవిడ్‌ సంక్షోభం, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఆంక్షల నేపథ్యంలో 2020, 2021 సంవత్సరాలతో పోల్చితే ప్రస్తుతం 95శాతానికి చేరుకుందని నగరానికి చెందిన వీఎఫ్‌ఎస్‌ గ్లోబËల్‌ సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దులు తెరవడం, కొవిడ్‌ మార్గదర్శకాలను సరళీకృతం చేయడంతో డిమాండ్‌ పెరిగిందని, 2021 దరఖాస్తుల సంఖ్యతో పోల్చితే 2022లో 129శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. 2022 డిసెంబర్‌ వరకు అసాధారణ ఔట్‌బౌండ్‌ ట్రావెల్‌ సీజన్‌గా నిలిచిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మహమ్మారి ప్రారంభం నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు ప్రీమియం ఆప్షన్‌ సేవలు కోరుకుంటున్నారని, ‘వీసా ఎట్‌ యువర్‌ డోర్‌స్టెప్‌’ (వీఏవైడి) వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది. ఆస్ట్రియా, చెక్‌రిపబ్లిక్‌, డెన్మార్క్‌, ఈస్టోనియా, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, హంగేరీ, ఐస్‌ల్యాండ్‌, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్‌, స్లోవేనియా, స్విట్జర్లాండ్‌, యూకే దేశాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించగా ఈ ధోరణి కనిపించిందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని