logo

సీతాపతి.. జేజేలు పలికెను జగతి

శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శోభాయాత్ర కనులపండువగా నిర్వహించారు. ప్రధాన ఊరేగింపు మధ్యాహ్నం 1.45 గంటలకు మొదలైంది.

Published : 31 Mar 2023 02:46 IST

అంబర్‌పేటలో శోభాయాత్రలో ఆకట్టుకున్న భారీ  శ్రీరాముడి విగ్రహం

ఒంటి నిండా ఆభరణాలతో  సీతమ్మ.. ఆ పక్కనే బంగారు కిరీటం, విల్లుతో శ్రీరాముడు.. పైన భానుడి భగభగలను సైతం లెక్కచేయకుండా.. సీతారాముల ధగధగలను చూస్తూ భక్తులు తన్మయత్వంతో పరవశించిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా గురువారం నగరంలోని ఆలయాల్లో జానకిరాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. చలువ పందిళ్లు, ముత్యాలతో అలంకరించిన మండపాలు.. తరలివచ్చిన భక్తులు.. జై  శ్రీరామ్‌ నామస్మరణతో శోభాయాత్రలు.. వెరసి మిథిలా నగరాన్ని తలపింప  జేసింది భాగ్యనగరం..


ఆసాంతం.. శోభాయమానం

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శోభాయాత్ర కనులపండువగా నిర్వహించారు. ప్రధాన ఊరేగింపు మధ్యాహ్నం 1.45 గంటలకు మొదలైంది. సీతారాంబాగ్‌ ఆలయం, బోయగూడ కమాన్‌ నుంచి మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, జాలి హనుమాన్‌, చుడిబజార్‌, బేగంబజార్‌ ఛత్రి, బర్తన్‌బజార్‌, సిద్ధి అంబర్‌ బజార్‌ మసీదు, శంకర్‌షేర్‌ హోటల్‌, గౌలిగూడ కమాన్‌, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంకు మీదుగా.. సుల్తాన్‌బజార్‌లోని వ్యాయామశాల వరకూ యాత్ర సాగింది.  సనత్‌నగర్‌ హనుమాన్‌ దేవస్థానం ఆవరణలోని రామ్‌లీలా మైదానంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగే వేడుకలు కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సీసీ టీవీ కెమెరాలు, వేలాది మంది పోలీసులను రంగంలోకి దింపారు. డ్రోన్ల ద్వారా పరిస్థితులను అంచనా వేస్తూ క్షేత్రస్థాయిలో సిబ్బందికి మార్గదర్శనం చేశారు.  మధ్యాహ్నం ఊరేగింపును బషీర్‌బాగ్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో అధికారులతో నగర సీపీ సీవీ ఆనంద్‌ సమీక్షించారు. ట్రాఫిక్‌ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు ట్రాఫిక్‌ సిబ్బందిని
సమన్వయం చేశారు.


కాషాయ జెండాలతో చిన్నారుల సందడి

ప్రత్యేక అలంకరణలో జానకి రాముడు

పురానాపూల్‌ కూడలి వద్ద శోభాయాత్రకు స్వాగతం పలుకుతున్న అశేష భక్తజనం

తన స్వగ్రామం తిమ్మాపూర్‌లో సీతారాములకు  పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సనత్‌నగర్‌లో సీతా కల్యాణానికి పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న మంత్రి తలసాని దంపతులు

బంజారాహిల్స్‌లో.. పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి దంపతులు

పద్మారావునగర్‌లో 55వ సారి స్వామి వారి కల్యాణం నిర్వహిస్తోన్న వెంకటసత్యనారాయణ శర్మ దంపతులు

సీతాఫల్‌మండిలో స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని