logo

‘మరో 15 సంవత్సరాల్లో అఖండ భారత్‌’

ప్రపంచ పటంలో పాకిస్థాన్‌ లేకుండా చేయటమే కాకుండా అఖండ భారత స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని శ్రీకాశీ సుమేరు పీఠాదీశ్వర్‌ యతి సామ్రాట్‌ అనంత్‌ శ్రీ విభూషిత్‌ జగద్గురు శంకరాచార్య స్వామి నరేంద్ర నంద సరస్వతి జీ మహరాజ్‌ పిలుపునిచ్చారు.

Published : 31 Mar 2023 02:44 IST

ప్రసంగిస్తున్న శ్రీకాశీ సుమేరు పీఠాధిపతి నరేంద్ర నంద సరస్వతిజీ మహరాజ్‌

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ప్రపంచ పటంలో పాకిస్థాన్‌ లేకుండా చేయటమే కాకుండా అఖండ భారత స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని శ్రీకాశీ సుమేరు పీఠాదీశ్వర్‌ యతి సామ్రాట్‌ అనంత్‌ శ్రీ విభూషిత్‌ జగద్గురు శంకరాచార్య స్వామి నరేంద్ర నంద సరస్వతి జీ మహరాజ్‌ పిలుపునిచ్చారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌గా వేరుపడిన వివిధ దేశాలను రాజ్యంగా ఏలిన చక్రవర్తి శ్రీరాముడు అని గుర్తుచేశారు. గురువారం రాత్రి భాగ్యనగర్‌ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హనుమాన్‌ టెకిరిలోని హనుమాన్‌ వ్యాయామశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని నిలబెట్టిన మహనీయుడు శ్రీరాముడని కొనియాడారు. అప్పటి ప్రభుత్వాల వైఫల్యంతో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నారు. మరో 15 సంవత్సరాల్లో భారత్‌ అఖండ భారతదేశంగా అవతరించబోతుందన్నారు. రాజస్థాన్‌ క్రాంతికారి శ్రీ సంత్‌ భోమ రాంజీ మహారాజ్‌ మాట్లాడుతూ..సనాతన ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. హిందూ దేశంలో సనాతన ధర్మాన్ని తెలుసుకునేందుకు పాఠ్యపుస్తకాల్లో పాఠాన్ని చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ భగవంతురావు, గోవిందరాటి, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

బేగంబజార్‌ ఛత్రి వద్ద శోభాయాత్రకు హాజరైన జనసందోహాన్నిఉద్దేశించి ప్రసంగిస్తున్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని