logo

Cyber crime: యూట్యూబ్‌ లైకుల పేరిట రూ.53 లక్షలకు కుచ్చు టోపి

యూట్యూబ్‌ వీడియోలకు లైకులు, కామెంట్లు చేస్తే.. వేతనం ఇస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యాపారి నుంచి రూ.53.30 లక్షలు కాజేశారు.

Updated : 15 Oct 2023 08:54 IST

ఈనాడు- హైదరాబాద్‌: యూట్యూబ్‌ వీడియోలకు లైకులు, కామెంట్లు చేస్తే.. వేతనం ఇస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యాపారి నుంచి రూ.53.30 లక్షలు కాజేశారు. నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన వ్యాపారి(34)ని అక్టోబరు 16న మలితా పేరుతో సైబరు నేరగాళ్లు వాట్సాప్‌ ద్వారా పరిచయం చేసుకున్నారు. యూట్యూబ్‌లోని వీడియోలకు లైకులు, కామెంట్లు పెడితే.. రోజూ రూ.150కి మించి సంపాదన ఉంటుందని వివరించారు. బాధితుడు నమ్మి, వారి చెప్పిన టెలిగ్రామ్‌ గ్రూపులో చేరాడు. లైకులు, కామెంట్లు చేసిన స్క్రీన్‌షాట్లు గ్రూపులో పోస్టు చేశాడు. మూడు టాస్కులు పూర్తయ్యాక.. కొంత డబ్బు కట్టాలని.. పూర్తయ్యాక మొత్తం తిరిగి ఇస్తామని నమ్మించారు. ప్రత్యేక వ్యాలెట్‌ ద్వారా తొలుత రూ.వెయ్యి పంపగా, తిరిగి రూ.1,300 పంపారు. రెండోసారి రూ.13 వేలు పంపగా.. రూ.16,900 బదిలీ చేశారు. లాభం రావడంతో బాధితుడు ఏడు విడతల్లో రూ.23.30 లక్షలు పంపాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వాలంటే మీ క్రెడిట్‌ స్కోరు ఇంకా బాగుండాలని.. ఇందుకు రూ.30 లక్షలు పంపాలని కోరగా.. అలాగే చేశాడు. అనంతరం రూ.20.14 లక్షలు కడితే మొత్తం డబ్బు ఇస్తామని చెప్పారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని