logo

హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు

హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమి పాలైతే ఆ నాయకుల బాధ అంతా ఇంతా కాదు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకొని ఐదేళ్లపాటు తలచుకుంటూ ఉంటారు.

Updated : 14 Nov 2023 05:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమి పాలైతే ఆ నాయకుల బాధ అంతా ఇంతా కాదు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకొని ఐదేళ్లపాటు తలచుకుంటూ ఉంటారు. అలాంటి హోరాహోరీ పోరు నగరంలోనూ జరిగాయి. పదులు, వందల సంఖ్యల ఓట్లతోనే విజయం ఖాయమైన సందర్భాలున్నాయి. ఇంత దగ్గరి వరకు వచ్చి ఓటమి పాలైన నేతలు తర్వాతి సందర్భాల్లో ఆ పొరపాట్లను సరిదిద్దుకొని విజయపతాకం ఎగరేశారు. నగరంలో ఉత్కంఠపోరు జరిగిన సందర్భాలను గమనిస్తే..

  • 1994 ఎన్నికల్లో టీడీపీ తరఫున హిమాయత్‌నగర్‌లో బరిలో దిగిన సి.క్రిష్ణయాదవ్‌ 0.1శాతం తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు మొత్తం 88,245 ఓట్లు రాగా.. సమీప ఆలె నరేంద్రపై ప్రత్యర్థిపై కేవలం 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • 1994 ఎన్నికల్లో మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసిన పి.నారాయణస్వామి ప్రత్యర్థి ఎం.ముఖేశ్‌పై 197 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • 1978 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్‌(ఐ) తరఫున పోటీ చేసిన పి.జనార్దన్‌రెడ్డి సమీప జనతా పార్టీ అభ్యర్థి ఎ.నరేంద్రపై 654 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • 1978 ఎన్నికల్లో జనతాపార్టీ తరఫున కంటోన్మెంట్‌ నుంచి బరిలో దిగిన బి.మచ్ఛేంద్రరావు సమీప కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థి ముత్తుస్వామిపై 366 ఓట్ల మెజార్టీతో నెగ్గారు.
  • 1978లో మహారాజ్‌గంజ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌(ఐ) తరఫున బరిలో దిగిన శివ పర్షాద్‌ సమీప జనతా పార్టీ అభ్యర్థి బద్రి విశాల్‌ పిట్టిపై 266 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
  • 1983లో ముషీరాబాద్‌ నుంచి తెదేపా తరఫున బరిలో ఉన్న శ్రీపతి రాజేశ్వర్‌ జనతా పార్టీ అభ్యర్థి ఎన్‌.నర్సింహారెడ్డిపై 307 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • 1983 ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన ఉమావెంకట్రామిరెడ్డి సమీప తెదేపా అభ్యర్థి టి.పి.రెడ్డిపై 64 ఓట్ల మెజార్టీతో నెగ్గారు.
  • 2004 ఎన్నికల్లో తెరాస తరఫున ముషీరాబాద్‌ బరిలో దిగిన నాయిన నర్సింహారెడ్డి సమీప భాజపా అభ్యర్థి కె.లక్ష్మణ్‌పై కేవలం 240 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
  • 2018 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి తెరాస అభ్యర్థిగా బరిలో దిగిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమీప అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై 376 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని