logo

ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం

వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 19 Apr 2024 03:00 IST

నారాయణరెడ్డి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడారు. ఆరోగ్యంగా ఉన్న కూలీలనే పనిలోకి తీసుకోవాలని, వ్యవసాయ పొలాలకు వెళ్లే రహదారులను బాగు చేయడం, ఇరు పక్కల ఉన్న ముళ్ల పొదలను తొలగించడం, నీటి పొదుపు, గ్రామానికి ఉపయోగపడే పనులను ఉపాధి హామీలో చేపట్టి లక్ష్యం చేరుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు తప్పనిసరిగా ఎఫ్‌టీఓ జనరేట్‌ చేయాలని అన్నారు. జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అతికించాలని తహసీల్దార్‌, ఎంపీడీఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, డీపీఓ జయసుధ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని