logo

‘అప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వ తీరు’

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఐఎన్టీయూసీ నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మౌనదీక్ష చేపట్టారు.

Published : 27 Mar 2023 04:55 IST

గోదావరిఖని: మౌన దీక్షలో కాంగ్రెస్‌ నాయకులు

గోదావరిఖని, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఐఎన్టీయూసీ నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మౌనదీక్ష చేపట్టారు. ఐఎన్టీయూసీ నాయకుడు జనక్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని దీక్షలో కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రధాని మోదీ కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసిందని ఆరోపించారు. భాజపాలో ఎంతో మంది నాయకులు రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డవారున్నారని.. మంత్రుల హోదాలో ఉన్న వారిపై కేసులు వేస్తే ఒక్కరూ పార్లమెంటులో మిగలరన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వారి ప్రాణాలు తీస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు ఎస్‌.నర్సింహారెడ్డి, ధర్మపురి, జగన్‌మోహన్‌, తిరుపతి, రాజేందర్‌, దాస్‌, మనోహర్‌, వికాస్‌, కార్పొరేటర్‌ సుజాత, నాయకులు వాజిద్‌ఖాన్‌ తదితరులున్నారు.

సెంటినరీ కాలనీలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

సెంటినరీకాలనీ: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని వ్యతిరేకిస్తూ రామగిరి మండల కాంగ్రెస్‌, దాని అనుబంధ సంఘాల నాయకులు ఆదివారం రామగిరి మండలంలో రాస్తారోకోను నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రమైన సెంటినరీ కాలనీకి చేరుకొన్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దపల్లి - మంథని రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాధాలు చేశారు. కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలశాఖ అధ్యక్షుడు చంద్రయ్య, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు శ్రీనివాస్‌, రవీందర్‌రెడ్డి, గణపతి, మహేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు