logo

ఉమ్మడి జిల్లా నుంచి తొలి మంత్రి.. ఒకే ఒక ముఖ్యమంత్రి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి మొట్టమొదటి రాష్ట్ర మంత్రి, ఒకే ఒక ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు. ఆయన ప్రధానమంత్రిగా పని చేసిన తొలి తెలుగు వ్యక్తి, దక్షిణ భారతీయుడు.

Published : 09 Nov 2023 05:03 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి మొట్టమొదటి రాష్ట్ర మంత్రి, ఒకే ఒక ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు. ఆయన ప్రధానమంత్రిగా పని చేసిన తొలి తెలుగు వ్యక్తి, దక్షిణ భారతీయుడు. 1957 నుంచి 1978 వరకు మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అప్పటి రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. పీవీ నరసింహారావు స్వగ్రామం పూర్వపు కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం (ప్రస్తుతం హనుమకొండ జిల్లా). ఆయన హనుమకొండలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1962-64, 1968-71 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో న్యాయ, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1964-67 సంవత్సరాల్లో న్యాయ, దేవాదాయ, వైద్య, ఆరోగ్య శాఖల బాధ్యతలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రిగా..

పీవీ నరసింహారావు 1971 సెప్టెంబరు 30న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1971 నుంచి 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1978 తర్వాత ఆయన మంథని నుంచి పోటీ చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని