logo

విద్యార్థి నాయకుడి నుంచి..

భాజపా పెద్దపల్లి అభ్యర్థి ఎంపికలో పది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు పార్టీలో సీనియారిటీకే ప్రాధాన్యం దక్కింది.

Published : 11 Nov 2023 03:56 IST

న్యూస్‌టుడే, పెద్దపల్లి: భాజపా పెద్దపల్లి అభ్యర్థి ఎంపికలో పది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు పార్టీలో సీనియారిటీకే ప్రాధాన్యం దక్కింది. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు అభ్యర్థిత్వం ఖరారైంది. 35 సంవత్సరాలుగా భాజపా, అనుబంధ సంస్థల్లో పని చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1985లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో సుల్తానాబాద్‌ జూనియర్‌ కళాశాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1986-87లో ఏబీవీపీ భాగ్‌ ప్రముఖ్‌గా పని చేశారు. 1988-89లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఏబీవీపీ కన్వీనర్‌గా వ్యవహరించారు. 1989-90లో నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా, 1990-92 వరకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా, 1992-97 వరకు భాగ్యనగర్‌ విభాగ్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా పని చేశారు. 1997-98, 1998-99 రెండు పర్యాయాలు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. అనంతరం భాజపాలో వివిధ బాధ్యతలు చేపట్టారు. కమిటీల సభ్యుడిగా పని చేశారు. 2012-14లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులు కాగా, 2014 నుంచి ప్రధానకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

వ్యక్తిగతం

పేరు: దుగ్యాల ప్రదీప్‌కుమార్‌

విద్యార్హతలు: ఎంఎ, ఎల్‌ఎల్‌బీ

వృత్తి: న్యాయవాది

పుట్టిన తేదీ: 1966 మే 1

తల్లిదండ్రులు: సుశీల, పురుషోత్తమరావు

భార్య: శ్రీదేవి

పిల్లలు:శ్రీతజా, శివపురుషోత్తమరావు

స్వస్థలం: జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని