logo

ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు

ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్‌ శాతాన్ని బట్టి మారుతుంది.

Published : 24 Apr 2024 05:28 IST

ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్‌ శాతాన్ని బట్టి మారుతుంది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నేతను ఎంత మంది కోరుకున్నారనేది ఆసక్తికరమే. దేశంలో రెండో సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1957లో కరీంనగర్‌ ద్విసభ నియోజకవర్గంలో 48.98 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ ఎన్నికల్లో 21.67 శాతం ఓట్లు సాధించిన ఎం.ఆర్‌.కృష్ణ, 19.33 శాతం ఓట్లు పొందిన శ్రీరంగారావు ఎంపీలుగా గెలుపొందారు. కరీంనగర్‌, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అతి తక్కువ ఓట్లు సాధించి లోక్‌సభలో అడుగుపెట్టిన సభ్యులు వీరిద్దరే కావడం గమనార్హం. 1962 మూడో సాధారణ ఎన్నికల సమయంలో ఆవిర్భవించిన పెద్దపల్లి నియోజకవర్గంలో మొదటి ఎంపీగా ఎన్నికైన ఎంఆర్‌ కృష్ణ 69.53 శాతం ఓట్లు సాధించారు. ఇప్పటివరకు అతి తక్కువ, అత్యధిక ఓట్లు సాధించిన రికార్డులు శ్రీరంగారావు, కృష్ణల పేరిటే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 50 శాతం కంటే ఓట్లు సాధించిన వారు కరీంనగర్‌ నుంచి నలుగురు, పెద్దపల్లి నుంచి ఆరుగురు ఉన్నారు. కరీంనగర్‌ నుంచి జువ్వాడి రమాపతిరావు(1962) 50.74 శాతం, ఎం.సత్యనారాయణరావు 1977, 1980లలో వరుసగా 58.83 శాతం, 56.12 శాతం, జువ్వాడి చొక్కారావు(1984) 50.46 శాతం, కె.చంద్రశేఖర్‌రావు(2004) 51.59 శాతం ఓటర్ల మద్దతు దక్కించుకున్నారు. పెద్దపల్లిలో ఎం.ఆర్‌.కృష్ణ 1962, 1967లలో వరుసగా 69.53 శాతం, 51.66 శాతం, వి.తులసీరామ్‌ 1971, 1977లలో వరుసగా 66.45 శాతం, 65.40 శాతం, కె.రాజమల్లు(1980) 56.99 శాతం, గొట్టె భూపతి(1984) 51.98 శాతం, జి.వెంకటస్వామి 1989, 2004లలో వరుసగా 50.05 శాతం, 60.91 శాతం, బాల్క సుమన్‌(2014) 56.82 శాతం ఓట్లు సాధించారు. -న్యూస్‌టుడే, పెద్దపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని