logo

మిగిలింది రెండు రోజులే!

లోక్‌సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది.

Published : 24 Apr 2024 05:36 IST

తుది దశకు చేరుతున్న నామినేషన్‌ ప్రక్రియ 

ఈనాడు, కరీంనగర్‌ : లోక్‌సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. దీంతో మూడు స్థానాల్లో మరిన్ని నామినేషన్లు దాఖలవనున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కరీంనగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి స్థానాలకు పోటీదారులు గణనీయంగా పెరుగుతున్నారు. తుది పరిశీలన ప్రక్రియ పూర్తయిన తరువాత అసలు బరిలో ఉన్నదెవరనేది తెలియనుంది.

కరీంనగర్‌లో 9.. పెద్దపల్లిలో 8

కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థానం కోసం సోమవారం 9 మంది నామినేషన్లు వేశారు. సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా పంచిక అశోక్‌, నేషనల్‌ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా కడ్తాల అనిల్‌రెడ్డిలతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా జహేదా బేగం, పెద్దపల్లి శ్రావణ్‌, కట్కూరి ఎనోస్‌, మేకల అక్షయ్‌కుమార్‌, గుడిసె మోహన్‌, సూరం చంద్రశేఖర్‌, పేరాల మానసరెడ్డిలు రిటర్నింగ్‌ అధికారి పమేల సత్పతికి నామపత్రాలు అందజేశారు. పెద్దపల్లి స్థానంలో ఎనిమిది మంది నామపత్రాలు దాఖలు చేశారు. బీఎస్పీ తరుపున ఇరుకుల్ల రాజనర్సయ్య, సోషలిస్ట్‌ పార్టీ (ఇండియా) అభ్యర్థిగా ములకల కనకయ్య, అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌  రిఫామ్స్‌ పార్టీ అభ్యర్థిగా సుమలత, యువతరం పార్టీ అభ్యర్థిగా చిలుక ఆనంద్‌, స్వతంత్ర అభ్యర్థులుగా తాళ్లపల్లి నరేశ్‌, రాచర్ల రాజేశం, ఇరికిల్ల రాజేశ్‌, సొల్లు రంజిత్‌లు రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ఖాన్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని