logo

బీసీ డిగ్రీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ డిగ్రీ గురుకులాల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీవో జ్యోతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బాలికల కోసం ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని వివరించారు.

Published : 05 Oct 2022 04:16 IST

ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ డిగ్రీ గురుకులాల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీవో జ్యోతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బాలికల కోసం ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని వివరించారు. ఈ నెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు.


10న పార్ట్‌ టైం అధ్యాపకుల ఎంపిక పరీక్ష

భద్రాచలం, న్యూస్‌టుడే: గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను పార్ట్‌ టైం పద్ధతిలో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ పీవో గౌతమ్‌, ఇంఛార్జి ఆర్సీవో డేవిడ్‌రాజ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కొన్ని ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఇటీవల అప్‌గ్రేడ్‌ అయ్యాయని వాటిల్లో ఈ నియామకాలుంటాయని చెప్పారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 10న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు స్క్రీనింగ్‌ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్నచోటే ఎంపిక పరీక్ష ఉంటుందని, గుండాలలో దరఖాస్తు చేసిన వారికి మాత్రం సుదిమళ్లలో పరీక్ష ఉంటుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని